International Yoga Day 2026:నేడు యోగా డే... కోల్‌కతా వేదికగా దేశానికి దిశానిర్దేశం చేయనున్న ప్రధాని మోదీ
International Yoga Day 2026: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుండి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది థీమ్ ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ గా నిర్ణయించారు.
International Yoga Day 2026
International Yoga Day 2026: భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన కానుక యోగా. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే ఈ అద్భుత విద్యను స్మరించుకుంటూ.. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరం ప్రధాన కేంద్రంగా నిలిచింది. కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్ వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలను స్వయంగా ముందుండి నడిపించనున్నారు.
ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన సందేశంతో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కంపెనీ యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అంటే అనే ఆకర్షణీయమైన థీమ్‌ను ఎంచుకుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే శారీరక మార్పులు, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో, మానసిక స్థిరత్వాన్ని, ఎమోషనల్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడంలో యోగా ఎంతగానో సహాయపడుతుందని.. తద్వారా ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన ప్రమాణాలను సొంతం చేసుకోవచ్చని ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.
కోల్‌కతా సెంట్రల్ ప్రాంతంలో ఉన్న రెడ్ రోడ్డుపై భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చే వేలాది మంది యోగా సాధకులు, సామాన్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అందరితో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్‌లో పాల్గొని స్వయంగా యోగాసనాలు వేయనున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని కోల్‌కతాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ఒక గ్లోబల్ మూవ్‌మెంట్‌గా మారిపోయింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 ప్రధాన ప్రాంతాలలో అంతర్జాతీయ యోగా వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. విదేశాలలో ఉన్న 210 కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు ఈ వేడుకల్లో చురుగ్గా భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించడానికి యోగా ఒక వారధిలా ఉపయోగపడుతోందని అధికారులు స్పష్టం చేశారు.
భారతదేశం పంపిన ప్రతిపాదనను అంగీకరిస్తూ.. ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) 2015లో అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి నేటి వరకు ప్రధాని మోదీ ప్రతి ఏటా దేశంలోని, ప్రపంచంలోని వివిధ చారిత్రక ప్రాంతాల నుంచి ఈ వేడుకలను ప్రారంభిస్తున్నారు. గతంలో న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, శ్రీనగర్, విశాఖపట్నంతో పాటు అమెరికాలోని న్యూయార్క్ వంటి ఐకానిక్ వేదికల నుంచి మోదీ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా లీడ్ చేశారు. ఆ పరంపరలోనే ఇప్పుడు కోల్‌కతా నగరం చేరింది.




