Jharkhand High Court: ఝార్ఖండ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. నియామక పరీక్షల రద్దుపై స్టే!
Jharkhand High Court: ఝార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల పలు నియామక పరీక్షలను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఝార్ఖండ్ హైకోర్టు గురువారం స్టే విధించింది.
Jharkhand High Court: ఝార్ఖండ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. నియామక పరీక్షల రద్దుపై స్టే!
Jharkhand High Court: పలు నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే నెపంతో వాటిని రద్దు చేస్తూ ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సంచలన నిర్ణయానికి ఆ రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన రద్దు ఉత్తర్వుల అమలుపై ఝార్ఖండ్ హైకోర్టు గురువారం స్టే విధించింది.
పరీక్షల్లో ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధించిన నలుగురు అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా అభ్యర్థులు తమ వాదనలను వినిపిస్తూ..తమ వాదనలను కనీసం వినకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నియామకాలను రద్దు చేసిందని పేర్కొన్నారు.
తాము ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో చేరామని, ప్రభుత్వ హడావుడి నిర్ణయం వల్ల తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలే తప్ప, నిబంధనల ప్రకారం కష్టపడి మెరిట్ సాధించిన తమ అందరినీ ఒకేసారి తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ప్రభుత్వ రద్దు ఉత్తర్వుల అమలును తక్షణమే నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో 15 రోజుల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వానికి స్పష్టమైన నోటీసులు జారీ చేసింది.




