Sudivya Kumar Sonu: జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ మృతి!
Sudivya Kumar Sonu: జార్ఖండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపై సీఎం హేమంత్ సోరేన్ దిగ్భ్రాంతి.
Sudivya Kumar Sonu: జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ మృతి!
Sudivya Kumar Sonu: జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను (56) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా తీవ్ర ఆరోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను గిరిడీహ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు మరియు అధికారులు ధృవీకరించారు.
సుదివ్య కుమార్ సోను గిరిడీహ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. జేఎంఎం పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నాయకుడిగా ఎదిగిన ఆయన, ప్రస్తుతం ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణవార్త వినగానే పార్టీ శ్రేణులు, మద్దతుదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మంత్రి సుదివ్య సోను అకాల మృతిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం జేఎంఎం కుటుంబానికి, జార్ఖండ్ రాష్ట్రానికి పూడ్చలేని తీరని లోటని పేర్కొన్నారు. రాష్ట్రానికి, పార్టీకి సుదివ్య చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే రవాణాశాఖ మంత్రి దీపక్ బిరువాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సుదివ్య సోను ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.




