Parlakhemundi: పర్లకీముండిలో అక్రమ నాటు సారా కేంద్రాలపై పోలీసుల మెరుపు దాడులు!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లా పర్లకీముండి, కాశీనగర్ సమితి పరిధిలోని సింగిపురంలో అక్రమ నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మెరుపు దాడులు చేసి 15 మందిని అరెస్టు చేశారు.

S.Anil, Gajapati Dst
Published on: 26 Oct 2026 7:06 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లకీముండిలో అక్రమ నాటు సారా కేంద్రాలపై పోలీసుల మెరుపు దాడులు!

Parlakhemundi: అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న కేంద్రాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆదివారం మెరుపు దాడులు చేశారు.

రాణా అధికారి ప్రశాంత్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌డీపీవో మాధవానంద నాయక్ ఆధ్వర్యంలో ఓ బృందం కాశీనగర్ సమితి కె.సీతాపురం పంచాయతీ పరిధిలోని సింగిపురంలో అక్రమంగా తయారు చేస్తున్న 15 కేంద్రాలపై దాడులు చేసినట్లు తెలిపారు.

పలువురి ఇళ్ల పెరట్లో, స్థానిక వ్యవసాయ భూముల సమీపంలో సారాను గుర్తించి, ధ్వంసం చేసినట్లు వివరించారు. 15 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎస్సై ప్రియబ్రత స్వాయిన్, జగరంగా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst