Kingfisher Beer Price Drop: మందుబాబులకు గుడ్ న్యూస్.. 'కింగ్‌ఫిషర్' బీర్ ధర ఇప్పుడు రూ.110
Kingfisher Beer Price Drop: ఎండల వేళ మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది.
Kingfisher Beer Price Drop: భానుడు భగభగలాడుతున్నాడు. ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈ నరకప్రాయమైన ఎండల వేళ.. సాయంత్రం కాగానే గొంతులో నాలుగు చల్లని బీరు చుక్కలు పడితే ఆ కిక్కే వేరు అనుకునే మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం అస్సలు ఊహించని ఒక అదిరిపోయే 'చిల్' న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీ సుకొచ్చిన సరికొత్త ఎక్సైజ్ పన్ను విధానం మందుబాబుల గుండెల్లో చల్లని సునామీ సృష్టించింది. అక్కడ బీర్ల ధరలు ఏకంగా భారీగా దిగివచ్చాయి.
కొత్త పన్నుల ప్రభావంతో కర్ణాటకలో బీర్ల ధరలు లీటరుపై ఊహించని రేంజ్‌లో తగ్గాయి. వివిధ రకాల బ్రాండ్లను బట్టి కనిష్టంగా రూ.20 నుండి గరిష్టంగా రూ.75 వరకు ధరలు దిగిరావడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా.. మెజారిటీ మద్యం ప్రియుల ఫేవరెట్ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ ధర వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పాత ధర రూ. 185 ఉండగా, కొత్త ధర రూ. 110లకు తగ్గింది. అంటే ఒకేసారి ఏకంగా రూ.75 మేర తగ్గడం విశేషం.
ఈ ధరల తగ్గింపు కేవలం కర్ణాటకలోని మందుబాబులకే కాదు.. మన తెలుగు రాష్ట్రాల బోర్డర్ గ్రామాల్లో ఉండే వారికి కూడా ఫుల్ జోష్ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల ప్రజలకు ఇప్పుడు కర్ణాటక వైన్‌షాపులు చాలా దగ్గర. మన దగ్గర బీర్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పక్కనే ఉన్న కర్ణాటకలో ఇంత తక్కువ ధరకే లభిస్తుండటంతో వీకెండ్స్ వస్తే చాలు బోర్డర్ దాటి చిల్ అవ్వడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ ఎండలకి తోడు ధరల మంటతో అల్లాడిపోయాం. కానీ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా మాలాంటి వారికి ఒక చల్లని వరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఈ వేసవి తాపానికి కర్ణాటక సర్కార్ ఇచ్చిన బీర్ ఆఫర్ మద్యం ప్రియుల జేబులకు భారీ ఉపశమనాన్ని ఇస్తూ, సరిహద్దుల్లో కొత్త హుషారును తీసుకొచ్చింది.




