9 పెళ్లిళ్లు చేసుకున్న భార్య..కోర్టు మెట్లు ఎక్కిన ఏడో భర్త.. చివరకు ఏం జరిగిదంటే..?

Karnataka High Court: ఏడో భర్తపై వేధింపుల కేసు పెట్టిన మహిళ బండారాన్ని కర్ణాటక హైకోర్టులో బయటపెట్టిన భర్త. ఆమెకు 9 పెళ్లిళ్లు అయ్యాయని నిరూపించడంతో హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది.

Gagan kumar
Published on: 11 Nov 2026 3:14 PM IST
Karnataka High Court
X

9 పెళ్లిళ్లు చేసుకున్న భార్య..కోర్టు మెట్లు ఎక్కిన ఏడో భర్త.. చివరకు ఏం జరిగిదంటే..?

Karnataka High Court: సాధారణంగా ఒక పెళ్లి చేసుకుంటేనే జీవితాంతం సర్దుకుపోవడానికి నానా తంటాలు పడుతుంటారు జనాలు. కానీ, ఒక మహిళ మాత్రం ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు, భర్తలను మార్చడం.. వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఈమెకు అలవాటుగా మారింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనూ, న్యాయవర్గాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటక హైకోర్టులో ఇటీవల విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది. తనను ఏడో భర్త విపరీతంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనపై భర్త అన్యాయం చేస్తున్నాడని, అతనికి తగిన శిక్ష పడేలా చేయాలని ఆమె కోర్టును కోరింది. కానీ, ఇక్కడే అసలు అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ముందు ఆ ఏడో భర్త గట్టిగా నిలబడ్డాడు. కేవలం నోటితో వాదించడం కాకుండా... కోర్టు ముందు కొన్ని సంచలన ఆధారాలను, పక్కా డాక్యుమెంట్లను బయటపెట్టాడు.

ఆ భర్త కోర్టుకు సమర్పించిన ఆధారాలు చూసి జడ్జే షాక్ తిన్నారు. నా మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ ఈ వగలాడికి నాకంటే ముందే ఆరుగురు భర్తలు ఉన్నారు. అంతేకాదు, ఇప్పటివరకు ఆమె చేసుకున్న పెళ్లిళ్లు అన్నీ ఇన్నీ కావు.. మొత్తం తొమ్మిది పెళ్లిళ్లు అని నిరూపించే పేపర్లు కోర్టు ముందుంచాడు. ఆ భర్త కోర్టులో వివరిస్తూ...ఈమె ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటుంది. ఎవరినైనా పెళ్లి చేసుకోవడం, కొద్ది రోజులు కాపురం చేయడం, ఆ తర్వాత కావాలనే వాళ్లతో గొడవలు పెట్టుకోవడం.. చివరికి గృహహింస అంటూ, వేధింపులు అంటూ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం.. ఇదే ఈమెకు పరిపాటిగా మారింది అని కళ్లకు కట్టినట్లు వివరించాడు.

సరిగ్గా చెప్పాలంటే, ప్రతి భర్తను నట్టేట ముంచడం ఈ కిలాడీ లేడీకి వెన్నతో పెట్టిన విద్య అని తేలిపోయింది. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ మహిళ ఊరుకుంటుందా..? ఆమె కూడా తన వాదన గట్టిగానే వినిపించింది. ఈ ఆరోపణలపై సదరు మహిళ స్పందిస్తూ... నేను అసలు తొమ్మిది పెళ్లిళ్లు చేసుకోలేదు. నేను కేవలం నలుగురినే వివాహం చేసుకున్నాను. అదీ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే మరో పెళ్లి చేసుకున్నాను తప్ప, ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదు అని వాదించింది.

అయితే, ఇరువైపుల లాయర్ల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు... ఆ మహిళ మోపిన ఆరోపణల్లో ఎక్కడా సరైన ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. చట్టాన్ని, చట్టంలోని రక్షణలను దుర్వినియోగం చేస్తూ ఇలా ఇష్టానుసారంగా కేసులు పెట్టడం సరికాదని తీవ్రంగా మందలించింది. ఆ మహిళ తన భర్తపై పెట్టిన వేధింపుల కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఆ ఏడో భర్తకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. చట్టం అనేది నిజంగా బాధితులకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించబడింది. కానీ కొందరు దీనిని ఆసరాగా చేసుకుని ఇలాంటి నాటకాలకు తెరలేపితే, చివరికి న్యాయస్థానాలు నిజానిజాలు నిగ్గుతేల్చి మొట్టికాయలు వేస్తాయి అనడానికి ఈ ఘటనే నిదర్శనం.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.