Karnataka: సిద్ధరామయ్యకు రాజ్యసభ.. కొడుకుకు మంత్రి పదవి..?

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమవగా, నూతన ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri
Published on: 27 May 2026 11:53 AM IST
Karnataka
X

Karnataka: సిద్ధరామయ్యకు రాజ్యసభ.. కొడుకుకు మంత్రి పదవి..?

Karnataka: కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణాం చోటు చేసుకుంది. సీఎం మార్పునకు మార్గం సుగమమైంది. నిన్న ఢిల్లీ పెద్దలతో జరిగిన చర్చలో అధికార మార్పిడిపై క్లారిటీ వచ్చింది. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. బీహార్ తరహా ఫార్మాలా అమలు చేయాలని చూస్తోంది. సీఎంగా డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అహిందా వర్గానికి సీఎం పదవి కేటాయించాలని సిద్ధూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.

హోంమంత్రి పదవి పరమేశ్వరకు ఇవ్వాలని సిద్దరామయ్య అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. సిద్ధూ తనయుడికి మంత్రి పదవి, సిద్ధరామయ్యకు రాజ్యసభ సభ నాయకుడిగా ఇచ్చే అవకాశం ఉంది. డీకే శివకుమార్‌ రేపు బెంగళూరుకు రానున్నారు. మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story