Karnataka: కర్ణాటకలో మళ్లీ మొదలైన అధికార మార్పిడి లొల్లి.. ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్!

Karnataka: కర్ణాటక రాజకీయం మరోసారి హీటెక్కింది. సీఎం మార్పు ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అత్యవసరంగా ఢిల్లీ పయనమయ్యారు.

Arun Chilukuri
Published on: 26 May 2026 11:11 AM IST
Karnataka
X

Karnataka: కర్ణాటకలో మళ్లీ మొదలైన అధికార మార్పిడి లొల్లి.. ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్!

Karnataka: కర్ణాటకలో మరోసారి అధికార మార్పిడి అంశం తెరపైకి వచ్చింది. కాసేపట్లో ఢిల్లీ పెద్దలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ కానున్నారు. మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పలు అంశాలపై మంతనాలు జరపనున్నారు. అనంతరం రాహుల్ గాంధీతో ఇరువురు నేతల సమావేశం కానున్నారు.

సీఎం మార్పు, మంత్రి వర్గ విస్తరణ, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు, SIR వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 20తో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటై ముడేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న కేసీ వేణుగోపాల్ నుంచి కర్ణాటక సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. కర్ణాటకలోని అధికార పార్టీలో వివాదాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుందని ప్రచారం ఊపందుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story