DK Shivakumar : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం..!
DK Shivakumar : కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.
DK Shivakumar : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. నేడే ప్రమాణ స్వీకారం..!
Karnataka Cm: కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఒక సంచలన ముగింపు దొరికింది. ఎన్నో రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కనకపుర బండరాడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ పరిణామంతో కర్ణాటక కాంగ్రెస్ వర్గాల్లో సరికొత్త జోష్ నెలకొంది.
రాజధాని బెంగళూరులోని లోక్ భవన్ ఈ చారిత్రాత్మక ఘట్టానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు సాయంత్రం 4.05 నిమిషాలకు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 10 మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కేబినెట్‌లో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ మంత్రుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘన ముగింపు వేడుకకు దేశ రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు భారీగా తరలిరానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ వేడుకలో భాగం కానున్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ మఠాధిపతులు, మత గురువులు, సినీ నటీనటులు , క్రీడా ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపనున్నారు.
తన వ్యూహాలతో, కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిన డీకే శివకుమార్‌కు ఎట్టకేలకు సీఎం పీఠం దక్కడంపై ఆయన అభిమానులు, అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు. అయితే, అధికారంలోకి రావడం ఒకెత్తయితే.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, పాలనను పరుగులు పెట్టించడం డీకేకు సరికొత్త సవాల్ అని చెప్పవచ్చు.




