Parlakhemundi: కాశీనగర్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి!
Parlakhemundi: కాశీనగర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగి సంక్షేమ కమిటీ సమావేశం. రోగులకు మెరుగైన వైద్యం, మందులు అందించాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి వైద్యులకు ఆదేశం.
Parlakhemundi: కాశీనగర్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి!
Parlakhemundi: గజపతి జిల్లా కాశీనగర్ సమితిలో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రోగి సంక్షేమ కమిటీ (ఆరోగ్య కళ్యాణ్ సమితి) సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, సమితి అధ్యక్షురాలు బల్ల సాయమ్మ ,ఎన్ఏసీ అధ్యక్షురాలు ఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు నాణ్యతతో కూడిన చికిత్స అందించాలని, వారికి అవసరమైన మందులు పంపిణీ చేయాలని అన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, పారిశుధ్య వ్యవస్థ, రోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు.
ఆసుపత్రిలో పాడైపోయిన యంత్రాలను మరమ్మతులు చేపట్టడం, లేదా కొత్తవి అమర్చాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రులు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో వైద్యులు సంగ్రామ్ నాయక్, సచికాంత మహాపాత్ర్ తదితరులు పాల్గొన్నారు.




