Kaziranga Accident : కజిరంగా ఘోర ప్రమాదం.. 26కు చేరిన మృతుల సంఖ్య

అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గోలాఘాట్ జిల్లా రొంగాజన్ సమీపంలో జాతీయ రహదారి-715 పై వేగంగా..

G Krishna
Published on: 14 Nov 2026 12:44 PM IST
Kaziranga Bus Truck Accident
X

Kaziranga Bus Truck Accident

అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గోలాఘాట్ జిల్లా రొంగాజన్ సమీపంలో జాతీయ రహదారి-715 పై వేగంగా వెళ్తున్న మినీ బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 26కు చేరినట్లు అస్సాం మంత్రి అతుల్ బోరా శనివారం వెల్లడించారు. జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (JMCH) లో చికిత్స పొందుతున్న తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు.

మృతుల్లో 14 మంది మహిళలు, ఒక మైనర్

ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో 14 మంది మహిళలు , 12 మంది పురుషులు ఉన్నారని, వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు మంత్రి ధృవీకరించారు. మృతుల్లో 23 మంది మృతదేహాలకు గోలాఘాట్‌లోనూ, మరో ముగ్గురికి జోర్హాట్‌లోనూ పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గౌరవప్రదంగా వారి స్వస్థలాలకు తరలించేందుకు , కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు వీలుగా ఆసుపత్రుల వద్ద ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

రంగంలోకి ప్రత్యేక వైద్య బృందాలు.. సీఎం పర్యటన

గోలాఘాట్ నుంచి నాగావ్ వైపు వెళ్తున్న మినీ బస్సు ప్రమాదానికి గురైన సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు గువహటి , రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మరోవైపు, ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించి, బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.