Kerala CM: కేరళ సీఎం కుర్చీ ఎవరికి? రాహుల్ ఛాయిస్ వర్సెస్ స్థానిక నేతల వ్యతిరేకత!
Kerala CM: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ భారీ విజయం సాధించినా సీఎం ఎంపికపై పీటముడి పడింది.
Kerala CM: కేరళ సీఎం కుర్చీ ఎవరికి? రాహుల్ ఛాయిస్ వర్సెస్ స్థానిక నేతల వ్యతిరేకత!
Kerala CM: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి 102 స్థానాలతో ప్రభంజనం సృష్టించినప్పటికీ, ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గెలిచిన ఉత్సాహం కంటే, పదవి కోసం నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కేరళ సీఎంగా చూడాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చర్చలకు ముందే రాహుల్, వేణుగోపాల్‌తో భేటీ కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే, ఢిల్లీ నుంచి మద్దతు లభిస్తున్న వేణుగోపాల్‌కు స్థానికంగా మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
సీఎం రేసులో ఉన్న మరో కీలక నేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత వీడీ సతీషన్.. వేణుగోపాల్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసీ వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా కేరళలో పోస్టర్లు వెలియడం కలకలం రేపింది. దీని వెనుక సతీషన్ అనుచరుల హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా సతీషన్‌ను పిలిచి వివరణ కోరినట్లు సమాచారం.
వేణుగోపాల్ తన పదవిని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతున్నారని సతీషన్ హైకమాండ్ ముందే ఆరోపించినట్లు తెలుస్తోంది. సతీషన్‌కు స్థానిక క్యాడర్‌తో పాటు ప్రధాన మిత్రపక్షం ముస్లిం లీగ్ (IUML) మద్దతు ఉండటం విశేషం.
ప్రస్తుతం కేరళ సీఎం పీఠం కోసం ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేసీ వేణుగోపాల్: హైకమాండ్ మరియు రాహుల్ గాంధీ మద్దతు. వీడీ సతీషన్: స్థానిక ఎమ్మెల్యేలు మరియు ముస్లిం లీగ్ అండ. రమేష్ చెన్నితాల: సీనియర్ నేతగా తనదైన శైలిలో ప్రయత్నాలు. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63, ఐయూఎంఎల్ 22 స్థానాలతో కూటమికి తిరుగులేని మెజారిటీని అందించాయి. మరి ఈ అంతర్గత విభేదాలను పరిష్కరించి, ఖర్గే ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.




