KSRTC: బస్సులో ప్రయాణిస్తున్నామా లేక విమానంలోనా?.. కేరళ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వీడియో వైరల్!
KSRTC: విమాన స్థాయి సౌకర్యాలతో కేరళ ఆర్టీసీ ప్రీమియం లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
KSRTC: బస్సులో ప్రయాణిస్తున్నామా లేక విమానంలోనా?.. కేరళ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వీడియో వైరల్!
KSRTC: బస్సులో ప్రయాణిస్తున్నామా లేక విమానంలో ఉన్నామా అనే సందేహం కలిగించేలా కేరళ ఆర్టీసీ (KSRTC) అత్యంత విలాసవంతమైన ప్రీమియం బస్సులను అందుబాటులోకి తెచ్చింది. తిరువనంతపురం-కొచ్చి మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ఈ బస్సుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులకు విమాన స్థాయి అనుభూతిని పంచేలా ఈ బస్సులో సకల సదుపాయాలను కల్పించారు.
సుదీర్ఘ ప్రయాణాలను కూడా ఎంతో హాయిగా మార్చేందుకు ఇందులో అత్యంత సౌకర్యవంతమైన లెదర్ సీట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణంలో వినోదం కోసం ప్రతి సీటుకు వ్యక్తిగతం తెరలను అందించారు. వీటితో పాటు మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, ఉచిత వైఫై సౌకర్యం కూడా కల్పించారు. కేవలం సాంకేతిక సదుపాయాలే కాకుండా, ప్రయాణికుల అవసరాలను ప్రత్యేకంగా చూసేందుకు ఎయిర్‌లైన్స్ మాదిరిగానే బస్సులో హోస్టెస్ సేవలను అందిస్తున్నారు. ప్రయాణ సమయంలో అల్పాహారంతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా సాధారణ బస్సు ప్రయాణాల్లో తీవ్ర అసౌకర్యానికి గురిచేసే మూత్రశాల సమస్యను పరిష్కరిస్తూ.. ఇందులో అత్యాధునిక బాత్‌రూమ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. విలాసవంతమైన ఈ వసతులన్నీ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.




