Parlakhemundi: గజపతి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని మరియు రైతులను ఆదుకోవాలని సీపీఎం, ఒడిశా కృషక్ సభ నాయకులు పర్లకీముండిలో నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

S.Anil, Gajapati Dst
Published on: 24 Oct 2026 6:35 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: గజపతి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి!

Parlakhemundi: ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పర్లాఖెముండి పట్టణంలోని బాలర్ పాఠశాల కూడలి ప్రాంతంలో సీపీఎం, ఒడిశా కృషక్ సభ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దండపాణి రౌత్ మాట్లాడుతూ దేశంలో సర్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. అదేవిధంగా ఒడిశా కృషక్ సభ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై రాసిన వినతి పత్రాన్ని కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ కి అందజేశారు.

జిల్లాలోని ఏడు సమితుల్లో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసమే గజపతి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.బంగారి, సభ్యులు మోహిత్ మిశ్రా, గోకుల్ డో బెహరా తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst