Parlakhemundi: చేతబడి హత్యాకాండ కేసు 12 మందికి యావజ్జీవ శిక్ష!
Parlakhemundi: గజపతి జిల్లా ముఠాగుడ చేతబడి నెపంతో తండ్రీకొడుకుల హత్య కేసులో సంచలన తీర్పు. 12 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన అదనపు సెషన్స్ కోర్టు.
Parlakhemundi: చేతబడి హత్యాకాండ కేసు 12 మందికి యావజ్జీవ శిక్ష!
Parlakhemundi: స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా ఎక్కడో మారుమూల గ్రామాల్లో చేతబడి వంటి మూఢ నమ్మకాలతో హతమార్చడం వంటి సంఘటనలు ఇంకనూ జరుగుతూనే ఉన్నాయి. అలాం టిదే గజపతి జిల్లా మోననా బ్లాక్ అడవ పీఎస్ పరిధి ముఠాగుడలో 2021 జూన్ 12న చేతబడి కార ణంతో తండ్రీకొడుకులను గ్రామం నడిబోడ్డున రాత్రి వేళ హతమార్చిన కేసులో 12 మంది నిందితు లను అదనపు సెషన్స్ జడ్జి హరప్రసాద్ పట్నాయక్ యావజ్జీవ కారాగారం శిక్ష, రూ.10 వేల జరిమానా విధించి గురువారం సంచలనాత్మక తీర్పును వెల్లడించారు.
అడవ పంచాయతీ ముఠాగుడ గ్రామస్తులు అంతా కలిసి చేతబడి చేస్తున్నాడని లుకో దోళ బెహరాను బయటకు పిలిచి జోసియా గోమాంగో ఇంటి వద్దకు ఈడ్చుకుని తీసుకువె ళ్లారు. కుమారుడు అనుకో దళ బెహరాను కూడా పిలిచి జిత్తు పట్టుకుని ఈడ్చుకువెళ్ళి కుసుమ వీధి వద్ద హాత్య చేశారు. అనుకో దళ బెహరా పీక కోసిన నేపథ్యంలో తండ్రి ఇంటివైపు వెళ్లినట్టు చెబుతు న్నారు. 2021 జూన్ 13న అడవ పోలీసు స్టేషన్లో లుకో దళ బెహరా కుమార్తె నిందితులపై కేసు పెట్టారు.
ఈ కేసును అప్పటి అడవ ఐఐసీ ఆనంద చంద్ర పాత్రో దర్యాప్తు చేశారు. ఈ కేసు చివరి విచా రణలో న్యాయమూర్తి 23 ప్రధాన సాక్షులను విచారించి, 27 దస్తావేజులను పరిశీలించారు. ఈ కేసులో 12 మంది నిందితులు జోసువా గోమాం గో (36), బెంజిమెన్ గోమాంగో, సంజయ్ గోమాంగో (28), అభిమన్యున రయికా (35), కం ద్రా గోమాంగో (67), మిఖాయిల్ గోమాంగో (55), సెతో రయికా (42), జోరిమియా రైకా(42), అబ్రహాం బోడోరయితో (45), జునేష్ రయితో (40) కుర్రా రయితో (60), సోమనాథ్ గోమాంగో (45) పరిగణించారు. ఈ కేసును అదనపు పబ్లిక్ ప్రాసీక్యూటర్ సరోజ్ కుమార్ రోథో వాదించారు. పర్యవేక్షణ ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా కేసు వివరాలు తెలియజేశారు.




