Manish Sisodia: కేజ్రీవాల్ బాటలోనే సిసోడియా.. న్యాయమూర్తిపై నమ్మకం లేదు..
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారణకు హాజరుకాబోనని, ఆమెపై తమకు నమ్మకం లేదని కేజ్రీవాల్ బాటలోనే లేఖ రాశారు.
Manish Sisodia: కేజ్రీవాల్ బాటలోనే సిసోడియా.. న్యాయమూర్తిపై నమ్మకం లేదు..
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుసరించిన వ్యూహాన్నే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఎంచుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మపై తమకు నమ్మకం లేదని, ఆమె ఎదుట విచారణకు హాజరుకాబోమని ఇద్దరు నేతలు స్పష్టం చేస్తూ లేఖలు రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
"జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నుంచి మాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు. అందుకే ఆమె ముందు వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాను. మాకు మిగిలింది సత్యాగ్రహం మాత్రమే" అని మనీష్ సిసోడియా తన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందే కేజ్రీవాల్ కూడా ఇదే తరహాలో లేఖ రాస్తూ.. ఆమె తీర్పునిస్తే దానిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన తర్వాత, ఫిబ్రవరి 27, 2026న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టేసి అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, సీబీఐ ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మకు ఆర్‌ఎస్‌ఎస్ (RSS), బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, ఆమె విచారణ నుంచి తప్పుకోవాలని ఆప్ నేతలు పిటిషన్ వేశారు. కానీ, ఏప్రిల్ 20న హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో.. ఇప్పుడు ఆప్ నేతలు కోర్టు బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు.




