Lovers: అర్థరాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన లవర్స్ ..తెల్లవారేసరికి ఏం చేశారంటే..?
Lovers: జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో విచిత్రమైన ప్రేమ కథ వెలుగుచూసింది.
Lovers: అర్థరాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన లవర్స్ ..తెల్లవారేసరికి ఏం చేశారంటే..?
Jharkhand Midnight Marriage: ఈ రోజుల్లో ప్రేమ కథలు అంటేనే సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. ట్విస్ట్‌లు, ఇంట్లో నుంచి పారిపోవడాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడాలు షరా మామూలైపోయాయి. కానీ, జార్ఖండ్‌లో జరిగిన ఒక రియల్ లవ్ స్టోరీ మాత్రం రోటీన్‌కు పూర్తి భిన్నంగా, క్లైమాక్స్ ఊహించని రేంజ్‌లో నడిచింది. రహస్యంగా కలుద్దామని ప్లాన్ వేసిన ఆ ప్రేమికులకు గ్రామస్థులు ఇచ్చిన షాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
జార్ఖండ్‌లోని గర్వా జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా తన ప్రియురాలిని చూడాలనే తపనతో ఆ యువకుడు ఆదివారం రాత్రి ఎవ్వరికీ తెలియకుండా, రహస్యంగా ఆమె ఇంటికి వెళ్లాడు. లవ్ బర్డ్స్ ఇద్దరూ ముచ్చట్లలో మునిగిపోయారు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. అప్పటికే సదరు యువకుడి కదలికలపై నిఘా ఉంచిన యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పక్కా ప్లాన్‌తో ఇద్దరినీ రూమ్‌లోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సాధారణంగా ఇలాంటి విషయాలు బయటపడితే గొడవలు, కొట్టుకోవడాలు, పోలీస్ కేసులు అవుతాయి. కానీ, ఇక్కడి గ్రామ పెద్దలు రూటే వేరు. ఉదయం వరకు ఆగితే రచ్చ అవుతుందని భావించి, అర్థరాత్రే అత్యవసరంగా పంచాయితీ పెట్టేశారు. ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి బోనులో నిలబెట్టారు. మాకు ఒకరంటే ఒకరు ఇష్టం.. పెళ్లికి రెడీ అని ప్రేమికులు ధైర్యంగా చెప్పడంతో గ్రామ పెద్దలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి గొడవలు వద్దు.. పోలీస్ కేసులు వద్దు.. ప్రేమికులు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి, ఇప్పుడే.. ఇక్కడే వీరికి పెళ్లి చేసేయాలి అని తీర్మానించారు.
అనుకున్నదే తడవుగా.. సోమవారం తెల్లవారుజామున కోడికూయక ముందే, ఊరి చివర ఉన్న స్థానిక ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. గ్రామస్థులంతా సాక్షులుగా నిలబడగా.. హిందూ సాంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా ఆ జంటకు ఘనంగా వివాహం జరిపించారు. రాత్రి లవ్స్ బర్డ్స్‌గా దొరికిపోయిన యువతీ యువకులు.. తెల్లవారేసరికి సాంప్రదాయబద్ధంగా పూలదండలు మార్చుకుని, ఏడడుగులు నడిచి భార్యాభర్తలుగా మారిపోయారు.
వివాహం ముగిసిన తర్వాత వధువు తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా అత్తవారింటికి వెళ్తున్న దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ విచిత్రమైన మిడ్‌నైట్ మ్యారేజ్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేమికులను కొట్టి విడదీసే రోజుల్లో.. ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించి, పెళ్లి చేసిన ఈ గ్రామస్థులు గ్రేట్ అబ్బా అంటూ నెటిజన్లు సదరు గ్రామ పెద్దలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




