Parag Shah: కోట్ల ఆస్తులున్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రోడ్లపై భిక్షాటన.. అసలు కారణం ఇదే!

Parag Shah: రూ.3,300 కోట్ల ఆస్తులున్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ముంబయి వీధుల్లో భిక్షాటన చేయడానికి అసలు కారణం ఏంటంటే? ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు దీక్ష.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 11:25 AM IST
Parag Shah
X

Parag Shah: కోట్ల ఆస్తులున్న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రోడ్లపై భిక్షాటన.. అసలు కారణం ఇదే!

Parag Shah: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఆ రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.3,300 కోట్లకు పైనే ఉంటుంది. అయితే ఇటీవల ఆయన ముంబయి వీధుల్లో సాధారణ భిక్షగాడిలా తిరుగుతోన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. అంతటి ధనవంతుడైన ఎమ్మెల్యేకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే..

ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పరాగ్ షా తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జైన సంప్రదాయంలోని ఓ ప్రత్యేక మాసంలో ఇటీవల ఒకరోజు భిక్షాటన దీక్ష చేపట్టారు. ఎవరూ తనను గుర్తుపట్టకుండా వేషధారణ మార్చుకుని, తన నియోజకవర్గంలోని వీధుల్లోనే రోజంతా నడిచారు. ఆ రోజంతా ఇతరులు పెట్టిందే తింటూ, రోడ్లపైనే నిద్రించారు. ఈ వినూత్న దీక్ష చేయడం ద్వారా తనకు జీవితం అంటే ఏమిటో పూర్తిగా అర్థమైందని ఆయన తెలిపారు.

‘‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల నుంచి లభించే గౌరవ మర్యాదలు వేరు. అదే వ్యక్తుల దగ్గరకు నేను భిక్షగాడిగా వెళ్లినప్పుడు, వారు నాకంటే ఉన్నతమైన వారిగా కనిపిస్తారు. మనం గమనించే విధానంలోనే అసలు కోణం ఉంటుంది. అదే నిజమైన జీవిత సత్యం.

ఈ దీక్ష చేయడం వల్ల ముంబయి నగర ప్రజలలోని గొప్ప సహాయ గుణాన్ని, మానవత్వాన్ని నేను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను’’ అని పరాగ్ షా పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.