Nana Patole: మహారాష్ట్రలో పొలిటికల్ హీట్.. ఇద్దరితో కాళ్లు కడిగించుకున్న కాంగ్రెస్ నేత నానా పటోలే!
Nana Patole: మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే ఇద్దరు వ్యక్తులతో కాళ్లు కడిగించుకున్న వీడియో వైరల్‌గా మారింది.
Nana Patole: మహారాష్ట్రలో పొలిటికల్ హీట్.. ఇద్దరితో కాళ్లు కడిగించుకున్న కాంగ్రెస్ నేత నానా పటోలే!
Nana Patole: మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ నానా పటోలే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇద్దరు వ్యక్తులతో తన కాళ్లు కడిగించుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో.. నానా పటోలే ఒక సోఫాలో హుందాగా కూర్చొని ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఆయన పాదాలను నీటితో కడిగారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన పాదాలను తుడిచి, పువ్వులు, పండ్లు సమర్పించి నమస్కరించుకున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో ఆధారంగా బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి, వారి ప్రాచీన రాచరిక సంస్కృతికి ప్రత్యక్ష నిదర్శనం" అంటూ కమలం నేతలు ఎద్దేవా చేశారు.
తనపై వస్తున్న విమర్శలు మరియు వివాదంపై నానా పటోలే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నవారు వేరెవరో కాదని, తన సొంత కుటుంబసభ్యులేనని వెల్లడించారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. తమ కుటుంబ ఆచారం ప్రకారం తన్ను గురువుగా భావించి, పాదపూజ చేస్తామని పట్టుబట్టడంతోనే తాను దానికి అంగీకరించానని వివరణ ఇచ్చారు.
ఆలయాల విరాళాలు, ప్రజాధనాన్ని దోచుకునే బీజేపీ నేతలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదని నానా పటోలే ఎదురుదాడి చేశారు. కుటుంబసభ్యులు గౌరవంతో చేసిన ఆచారాన్ని కూడా రాజకీయం చేయడం భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.




