Maharashtra: మహారాష్ట్రలో పెద్దపులి బీభత్సం.. తల్లిదండ్రుల కళ్లెదుటే యువకుడు మృతి!

Maharashtra: మహారాష్ట్ర భండారా జిల్లాలో పెద్దపులి బీభత్సం. తల్లిదండ్రుల కళ్లెదుటే 26 ఏళ్ల యువకుడిని బలిగొన్న పులి. రెండు రోజుల్లో ఇద్దరి ప్రాణాలు తీసిన వన్యప్రాణులు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 10 Nov 2026 8:58 AM IST
Maharashtra
X

Maharashtra: మహారాష్ట్రలో పెద్దపులి బీభత్సం.. తల్లిదండ్రుల కళ్లెదుటే యువకుడు మృతి!

Maharashtra: దీపావళి పండుగ వేళ మహారాష్ట్రలోని భండారా జిల్లాలో వన్యప్రాణుల దాడులు కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రులతో కలిసి పొలంలో వరి కోత పనులు చేస్తున్న 26 ఏళ్ల యువకుడిపై పెద్దపులి దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సాకోలి తాలూకాలోని బామ్హి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కునాల్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి పొలంలో వరి కోత పనులు చేస్తున్నాడు. అదే సమయంలో పొదల్లో మాటువేసి ఉన్న పెద్దపులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే కొడుకు పెద్దపులి దాడికి బలవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరోవైపు, కేవలం రెండు రోజుల క్రితమే భండారా జిల్లాలోని లఖ్‌ందూర్ తాలూకా డోనాడ్ గ్రామంలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. వరుసగా రెండు వన్యప్రాణుల దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలోని రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పంట కోతల సమయంలో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో వన్యప్రాణుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.