Mamata Banerjee: బీజేపీ బాంబుల కుట్ర.. ఎన్‌ఐఏతో కలిసి డ్రామాలు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుళ్లకు బీజేపీ కుట్ర చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ సాయంతో స్థానిక యువతను వేధిస్తారని హెచ్చరించారు.

Arun Chilukuri
Published on: 17 April 2026 11:27 AM IST
Mamata Banerjee
X

Mamata Banerjee: బీజేపీ బాంబుల కుట్ర.. ఎన్‌ఐఏతో కలిసి డ్రామాలు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. బీజేపీపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, బాంబు పేలుళ్లకు పాల్పడాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని ఆమె పేర్కొన్నారు.

దిన్హాటాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడుతూ బీజేపీ వ్యూహాలను ఎండగట్టారు."బీజేపీ బయటి వ్యక్తులను తీసుకొచ్చి బెంగాల్‌లో బాంబులు పేల్చాలని చూస్తోంది. ఆ తర్వాత వెంటనే ఎన్‌ఐఏ (NIA)ని రంగంలోకి దించి, ఆ నిందను స్థానిక యువతపై వేసి వారిని అరెస్ట్ చేయిస్తారు" అని మమత ఆరోపించారు.

పోలింగ్ తేదీలు సమీపిస్తున్న కొద్దీ అల్లర్లు సృష్టించి, తద్వారా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజలు ఓపికగా ఉండాలని, ఎటువంటి ఘర్షణలకు తావివ్వకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే రాత్రి వేళల్లో కూడా నిశితంగా పర్యవేక్షించాలని స్థానికులకు సూచించారు. బెంగాల్ అస్తిత్వాన్ని, రాజకీయ హక్కులను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. అనంతరం మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story