Gujarat horror case: 2వేల ఇంటి అద్దె కట్టలేక భార్య, కూతుర్ని.. ఓనర్‌తో
Gujarat horror case: సభ్యసమాజం తలదించుకునేలా, మానవత్వానికే మచ్చతెచ్చే అత్యంత దారుణమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
Gujarat horror case: 2వేల ఇంటి అద్దె కట్టలేక భార్య, కూతుర్ని.. ఓనర్‌తో
Gujarat horror case: సభ్యసమాజం తలదించుకునేలా, మానవత్వానికే మచ్చతెచ్చే అత్యంత దారుణమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. కేవలం కొన్ని వేల రూపాయల అద్దె బాకీ కోసం ఒక భర్త కసాయిగా మారగా, కామాంధుడైన ఇంటి యజమాని తల్లీకూతుళ్ల జీవితాలను బలితీసుకున్నాడు. వినడానికే ఒళ్ళు గగుర్పొడిచే ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బతుకుదెరువు కోసం వలస వస్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం జీవనోపాధి కోసం సుమారు ఆరు నెలల క్రితం మోర్బీ జిల్లాకు వలస వచ్చింది. అక్కడ నెలకు రూ. 2 వేల అద్దెతో ఒక ఇంట్లో నివాసం ఉండటం ప్రారంభించారు. మొదట్లో అద్దె సరిగ్గానే చెల్లించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో వరుసగా నాలుగు నెలల పాటు వారు ఇంటి అద్దె చెల్లించలేకపోయారు.
నాలుగు నెలల అద్దె రూ. 8 వేలు బకాయి పడటంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలంటూ సదరు కుటుంబంతో గొడవ చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ భర్త సభ్యసమాజం అవాక్కయ్యే దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాను డబ్బులు చెల్లించలేనని, దానికి బదులుగా తన భార్యను, 13 ఏళ్ల మైనర్ కుమార్తెను వాడుకోవచ్చంటూ ఇంటి యజమానితో ఒక అమానవీయ ఒప్పందం కుదుర్చుకున్నాడు. భర్తే స్వయంగా కామాంధుడికి దారి చూపించడంతో.. ఆ ఇంటి యజమాని అటు తల్లిపై, ఇటు కూతురిపై పలుమార్లు వరుసగా లైంగిక దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.
వెలుగులోకి తెచ్చిన తల్లి.. నిందితులు అరెస్ట్
ఇంటి యజమాని పెడుతున్న నరకయాతనను భరించలేక, తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ ఎలాగోలా ఈ ఘోరం గురించి తన తల్లికి సమాచారం అందించింది. ఈ దారుణం విని షాకైన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో కదిలిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కన్నకూతురిని, భార్యను కామాంధుడికి అప్పగించిన ఆ కసాయి భర్తతో పాటు,
అఘాయిత్యానికి పాల్పడిన ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘోర నేరంలో భాగస్వామ్యమున్న మరో నిందితుడి కోసం పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా గాలిస్తున్నారు. డబ్బు కోసం కన్నబిడ్డను, కట్టుకున్న భార్యను ఇలాంటి నరకకూపంలోకి నెట్టిన ఆ భర్త ప్రవర్తనపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.




