Chandrapur: రాజురా కోర్టు వద్ద కాల్పుల కలకలం – వ్యక్తి హత్యాకాండ, నిందితుల కోసం గాలింపు
Chandrapur: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా తాలూకా కోర్టు వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో వినోద్ అలియాస్ పాపా జాదవ్ మృతి చెందాడు.
Chandrapur: రాజురా కోర్టు వద్ద కాల్పుల కలకలం – వ్యక్తి హత్యాకాండ, నిందితుల కోసం గాలింపు
చంద్రపూర్: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని రాజురా నగరం కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం తాలూకా కోర్టు సమీపంలోని కొబ్బరి బొండాల దుకాణం వద్ద వినోద్ అలియాస్ పాపా జాదవ్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు.
కాల్పుల అనంతరం నిందితులు మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన జాదవ్‌ను స్థానికులు వెంటనే రాజురా ఉపజిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం చంద్రాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జాదవ్ మృతి ..
సమాచారం అందుకున్న రాజురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. రాజురా పట్టణంలో గతంలోనూ కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం, పలువురు ప్రాణాలు కోల్పోవడంతో మరోసారి శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోర్టు సమీపంలోనే కాల్పులు జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.




