Supreme Court: దిల్లీ నిరసనల వేళ ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపిన కేంద్ర హోంశాఖ
Supreme Court: దిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన వ్యవహారంలో సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్. దిల్లీ పోలీస్ కమిషనర్ అఫిడవిట్.
Supreme Court: దిల్లీ నిరసనల వేళ ఇంటర్నెట్ నిలిపివేత.. సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపిన కేంద్ర హోంశాఖ
Supreme Court: దేశ రాజధాని దిల్లీలో ఆందోళనల సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారన్న కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ అత్యున్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో సవివరమైన అఫిడవిట్ దాఖలు చేశారు.
అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 24 గంటల పాటు సెల్యులార్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని దిల్లీ పోలీసులు కోరారని, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ అభ్యర్థనను ఆమోదించామని హోంశాఖ కార్యదర్శి వివరించారు.
అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10 రాత్రి 10 గంటల వరకు రైసినా హిల్స్ చుట్టుపక్కల 4 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సెల్యులార్ డేటాను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. వైఫై (Wi-Fi), బ్రాడ్బ్యాండ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలిగించలేదని స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన నిరసనల వేళ.. దిల్లీలో పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు అమలు చేయవద్దని, ఇంటర్నెట్ బంద్ విధించవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించడంతో సుప్రీంకోర్టు హోంశాఖ కార్యదర్శితో పాటు దిల్లీ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.




