Minister: మారువేషంలో వచ్చిన మంత్రి.. బయటపడ్డ పూజారి లీలలు.. చిన్న కథ సామి
Minister: ఆలయంలో వీఐపీ దర్శనం పేరిట దోపిడీకి పాల్పడుతున్న పూజారిని దేవాదాయ శాఖ మంత్రి రమేష్ బట్టబయలు చేశారు.
Minister: మారువేషంలో వచ్చిన మంత్రి.. బయటపడ్డ పూజారి లీలలు.. చిన్న కథ సామి
Minister Ramesh: భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, దేవుడి దర్శనం పేరిట సాగుతున్న ఒక భారీ అక్రమ దందాకు తమిళనాడు హిందూ మత, దేవాదాయ శాఖ మంత్రి రమేష్ సినిమా స్టైల్‌లో చెక్ పెట్టారు. తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం (మురుగన్ టెంపుల్) వేదికగా సాగిన ఈ హై-డ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. VIP దర్శనాల పేరిట సామాన్య భక్తులను కొందరు పూజారులు ఎలా దోచుకుంటున్నారో మంత్రి స్వయంగా రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా బట్టబయలు చేశారు.
తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి వచ్చే సాధారణ భక్తుల నుంచి VIP దర్శనం చేయిస్తామంటూ కొందరు పూజారులు, సిబ్బంది రూ. 4,000 నుండి ఏకంగా రూ. 10,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై ఎలాగైనా నిజా నిజాలు తేల్చాలని, దళారుల ఆటకట్టించాలని దేవాదాయ శాఖ మంత్రి రమేష్ ఒక సాహసోపేతమైన, రహస్య ప్లాన్ వేశారు.మంత్రి రమేష్ ఎవరికీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేయకుండా ఆలయానికి చేరుకున్నారు. ఒక సాదాసీదా టీ-షర్టు ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని పక్కా సామాన్య భక్తుడిలా ఉదయాన్నే క్యూలైన్‌లో నిలబడ్డారు.
మంత్రిని ఒక సాధారణ భక్తుడిగా భావించిన ఆలయ పూజారి ఒకరు ఆయన వద్దకు వచ్చారు. రూ. 4,000 ఇస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేకుండా నేరుగా VIP దర్శనం కల్పిస్తా అంటూ ఆశ చూపాడు. దానికి మంత్రి రమేష్ కూడా సామాన్యుడిలాగే నటిస్తూ అంగీకరించారు. సదరు పూజారి చెప్పిన జీ-పే నంబర్‌కు తన మొబైల్ ద్వారా వెంటనే రూ. 4,000 నగదును బదిలీ చేశారు.డబ్బులు అకౌంట్‌లో పడగానే సదరు పూజారి ఎంతో సంబరంగా మంత్రిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే, లోపలికి వెళ్లిన తనిఖీ కేంద్రం వద్ద మంత్రి రమేష్ ఒక్కసారిగా తన ముఖానికి ఉన్న మాస్క్ తీసివేసి.. నేనే దేవాదాయ శాఖ మంత్రిని అని తన అసలు గుర్తింపును బయటపెట్టారు.
అంతే.. ఎదురుగా ఉన్నది సామాన్య భక్తుడు కాదు, సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి అని తెలియడంతో ఆ పూజారి గుండె ఆగినంత పనైంది, ఒక్కసారిగా బిత్తరపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆ పూజారిని అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం, తాను తప్పు చేశానని, ఇకపై ఇలాంటి అక్రమాలకు పాల్పడనని సదరు పూజారి చేతితో స్వయంగా క్షమాపణ లేఖ రాసి ఇచ్చాడు. ఈ షాకింగ్ ఘటన తర్వాత మంత్రి రమేష్ ఆలయంలో జరుగుతున్న పరిపాలన లోపాలు, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తప్పు చేసిన ఉద్యోగులు, పూజారులకు నోటీసులు జారీ చేశారు. మంత్రి రమేశ్ తీసుకున్న ఈ మెరుపు తనిఖీ నిర్ణయంపై, సామాన్య భక్తులను దోచుకునే దళారీ వ్యవస్థపై ఆయన ఉక్కుపాదం మోపిన తీరుపై భక్తులు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ఇలా ఉండాలి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
திருச்செந்தூர் சுப்பிரமணிய சுவாமி திருக்கோயிலில் தொடர்ந்து பக்தர்கள் தரிசனம், அன்னதானம், அடிப்படை வசதிகள், சொத்துப் பதிவேடு விவரங்கள், திருப்பணிகள் மற்றும் நிலுவையில் உள்ள கோயிலுக்கு வர வேண்டிய வருவாய் போன்ற பல்வேறு கோணங்களில் ஆய்வு நடத்தி வருகிறோம்.
— TVK Ramesh (@RameshOffcl) May 29, 2026
முறைகேட்டில் ஈடுபடுபவர்கள்…




