విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే!
Ministry of Home Affairs: విదేశీయుల ఇమిగ్రేషన్, వీసా నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది.
విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే!
Ministry of Home Affairs: భారత్‌కు వచ్చే విదేశీ పౌరుల ఇమిగ్రేషన్ (Immigration) నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు తాము అనుమతి పొందిన సమయం కంటే ఎక్కువ రోజులు భారతదేశంలో కొనసాగాలనుకుంటే.. ఇకపై వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఉంటున్న విదేశీ పౌరుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
భారత్‌కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు ఉన్న వీసాలపై వచ్చే విదేశీయులందరికీ ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. వీరు తమ పర్యటనను పొడిగించుకోవాలనుకుంటే వీసా ఎక్స్‌పైరీ కాకముందే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
గతంలో ఉన్న నిబంధన: వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 14 రోజుల లోపు పొడిగింపు (Extension) కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుత మార్పు: పాత నిబంధనను రద్దు చేస్తూ, ఇకపై వీసా గడువులో ఉండగానే ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.
భారతదేశంలో సంతానం పొందే విదేశీయుల కోసం హోంశాఖ మరో కీలక మార్పును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, భారత్‌లో విదేశీ దంపతులకు బిడ్డ జన్మించిన 30 రోజుల్లోపు ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే, ఇందులో ఒక మినహాయింపును కూడా ఇచ్చారు. పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయ జాతీయులై ఉండి, వారు తమ భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) అలాగే ఉంచుకోవాలని భావిస్తే.. అలాంటి వారికి ఈ చైల్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ నిబంధన నుండి మినహాయింపు లభిస్తుంది.




