Parlakhemundi: ఒడిశాలో నదిలో గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం!
Parlakhemundi:ఒడిశాలోని గజపతి జిల్లా అమర గ్రామం వద్ద నదిలో గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. అగ్నిమాపక సిబ్బంది 30 గంటల శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు.
Parlakhemundi: ఒడిశాలో నదిలో గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం!
Parlakhemundi: గజపతి జిల్లా గుసాని సమితి పర్లాఖెముండి పట్టణ ఆదర్శ ఠాణా పరిధిలోని అమర గ్రామ ప్రాంతంలో గల్లంతైన వృద్ధుడు దుర్గా ప్రసాద్ పాణిగ్రాహి(60 మృతదేహం ను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది కనుగొన్నారు.
అగ్నిమాపక అధికారి దీరేంద్ర కుమార్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం... శనివారం నదిలో స్నానానికి గల్లంతైన పాణిగ్రహి ను సుమారు 30 గంటల అనంతరం నదిలో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని కనుగొన్నట్లు తెలిపారు.
మృతుడు శ్రీకాకుళం జిల్లా తిడ్డీమి గ్రామానికి చెందిన వాసిగా తెలిసిందే . ఈయన అమర గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి లలిత దేవి మందిరంలో పూజ చేస్తూ ఉండేవారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.




