Paralakhemundi: అవినీతి నిర్మూలన వారోత్సవాలు.. ఘనంగా అవగాహన ర్యాలీ!

Paralakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండిలో అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా మిషన్ శక్తి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

S.Anil, Gajapati Dst
Published on: 1 Nov 2026 9:38 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: అవినీతి నిర్మూలన వారోత్సవాలు.. ఘనంగా అవగాహన ర్యాలీ!

Paralakhemundi: అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా శనివారం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో మిషన్ శక్తి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ను జిల్లా సాంఘిక, సంక్షేమ శాఖ అధికారిణి మునోరమ దేవి పచ్చి జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం పట్టణ పురవీధుల్లో మహిళా సంఘాల సభ్యులు ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన చేపట్టారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంతంలో అధికారులు, మహిళా సంఘాల సభ్యులతో ప్రతిజ్ఞ చేపట్టారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోతుందని, దానిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని రకాల చర్యలను కచ్చితంగా పాటించాలని కోరారు. ముఖ్యంగా వివిధ అవసరాల కోసం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిజాయితీ సేవలో అందించాలని అన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్సై త్రిలోచన్ సోడంగి, మిషన్ శక్తి జిల్లా అనుసంధానకర్త తిమన్ బోర, డిప్యూటీ కలెక్టర్ కీర్తి స్వయి శుక్లా తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst