Parlakhemundi: అసెంబ్లీ కమిటీ సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై చర్చ!
Parlakhemundi: భువనేశ్వర్ అసెంబ్లీలో పర్యావరణ పరిరక్షణపై శాసనసభ కమిటీ సమావేశం మహేంద్ర తనయ నదిలో ఆంధ్ర వ్యర్థాల ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి.
Parlakhemundi: అసెంబ్లీ కమిటీ సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై చర్చ!
Parlakhemundi: భువనేశ్వర్ లోని శాసనసభ 6వ కమిటీ సమావేశం అసెంబ్లీ భవనం 55వ నంబర్ గదిలో శుక్రవారం కాలుష్య మండలి శాఖతో సమావేశం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు దుష్మంత్ కుమార్ స్వయిన్ అధ్యక్షతన ఏర్పటుచేసిన సమావేశానికి గజపతి జిల్లా పర్లాఖెముండి నియోజకవర్గ
ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, లక్ష్మణ్ బాగ్, అభిమన్యు శెఠి, ప్రతాప చంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ, ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
సమావేశంలో ఎమ్మెల్యే రూపేష్ మాట్లాడుతూ పర్లాఖెముండి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మహేంద్ర తనయ నదిలో ఆంధ్ర వ్యర్ధాలను పారవేయడం,అటవీ అతిథి గృహం ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు.
ముఖ్యంగా నదిలో వ్యర్ధాలను పారబోయడం వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని, ఈ విషయంపై స్థానిక ఆంధ్ర అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి శాఖ అధికారులకు కోరారు.




