Paralakhemundi: గజపతి జిల్లాలో అమ్మోనియా లీకేజీపై ఘనంగా మాక్ డ్రిల్!
Paralakhemundi: గజపతి జిల్లా గుసాని సమితి లావణ్య గడ వద్ద కోస్టల్ బయోటెక్ ఆధ్వర్యంలో అమ్మోనియా లీకేజీపై నిర్వహించిన మాక్ డ్రిల్‌లో పాల్గొన్న అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్.
Paralakhemundi: గజపతి జిల్లాలో అమ్మోనియా లీకేజీపై ఘనంగా మాక్ డ్రిల్!
Paralakhemundi: అత్యవసర, విపత్తుల వేల క్షణాల వ్యవధిలో ప్రజలను ఏ విధంగా కాపాడాలన్నది స్పష్టంగా తెలిపేలా మంగళవారం గజపతి జిల్లా గుసాని సమితి లావణ్య గడ ప్రాంతంలో కోస్టల్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అమ్మోనియా లీకేజీపై మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ, అగ్నిమాపక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంయుక్తంగా పాల్గొని మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
స్వీయ రక్షణ ఎలా పొందాలో వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలను తెలియజేశారు. అమ్మోనియా లీక్ అయితే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి దీరేంద్ర కుమార్ దాస్, డిప్యూటీ కలెక్టర్ త్రినాధ్ సాహు, గారబంద ఠాణా అధికారి ప్రశాంత్ నిషిక, ప్లాంట్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




