Parlakhemundi: మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని గజపతి జిల్లాలో సేవా కార్యక్రమాలు!

Parlakhemundi: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, పుట్టినరోజు సందర్భంగా గజపతి జిల్లాలో 'సేవా సంకల్ప అభియాన్'.

S.Anil, Gajapati Dst
Published on: 13 Sept 2026 1:24 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని గజపతి జిల్లాలో సేవా కార్యక్రమాలు!

Parlakhemundi: దేశ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గజపతి జిల్లాలో సేవా కార్యక్రమాలు

"సేవా సంకల్ప్ అభియాన్"పేరిట చేపట్టడం జరుగుతుందని భాజపా జిల్లా అధ్యక్షుడు నబ కిషోర్ సబర్ అన్నారు. శనివారం పర్లాఖెముండి పట్టణంలోని డోలె ట్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి భాజపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం వివరాలు ఇలా వెల్లడించారు.

ప్రజా సేవ,సుపరిపాలనలో 25 ఏళ్ల నిరంతర ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో 7 అక్టోబర్ 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైన ఈ ప్రస్థానం, ప్రజల సంక్షేమం కోసం సేవ, అంకితభావం, అచంచలమైన సంకల్పంతో సాగింది.

దేశంలోని సామాన్య పౌరుల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకురావాలనే ఆయన నిబద్ధత, మొదట గుజరాత్‌లో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాలలో భారీ .గుణాత్మక మార్పులకు దారితీసింది. ప్రజా సేవకే అన్నిటికంటే అధిక ప్రాధాన్యతనిస్తూ ఆయన జన్మదిన వేడుకలు ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు నిర్వహించనట్లు తెలిపారు.

ముఖ్యంగా విద్యార్థుల మధ్య పోటీలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సాధారణ కార్యదర్శులు జగన్నాథ్ మహాపాత్ర్, ఈ ప్రశాంత్ పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst