బెంగాల్ ఎన్నికల్లో అద్భుతం: ఓటు పోయినా.. ఎమ్మెల్యేగా గెలిచిన మొతాబ్ షేక్!

Motab Shaikh: పశ్చిమ బెంగాల్ ఫరక్కా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మొతాబ్ షేక్ సంచలన విజయం సాధించారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించబడినప్పటికీ, సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ ద్వారా ఓటు హక్కు పొంది, బీజేపీ అభ్యర్థిపై 8193 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Arun Chilukuri
Published on: 6 May 2026 9:16 AM IST
motab shaikh
X

బెంగాల్ ఎన్నికల్లో అద్భుతం: ఓటు పోయినా.. ఎమ్మెల్యేగా గెలిచిన మొతాబ్ షేక్!

Motab Shaikh: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అరుదైన మరియు స్ఫూర్తిదాయక సంఘటన వెలుగుచూసింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించబడి, కనీసం ఓటు వేసే హక్కు కూడా లేని ఒక వ్యక్తి.. ఏకంగా ఎమ్మెల్యేగా విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫరక్కా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మొతాబ్ షేక్ ఈ ఘనత సాధించారు.

ఎన్నికలకు ముందు నిర్వహించిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియలో సాంకేతిక కారణాలతో మొతాబ్ షేక్ పేరును ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఓటు హక్కు తప్పనిసరి కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పడిన అప్పీలేట్ ట్రైబ్యునల్, నామినేషన్ల గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు ఆయన ఓటును పునరుద్ధరిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

అడ్డంకులన్నీ అధిగమించి ఫరక్కా నుంచి పోటీ చేసిన మొతాబ్ షేక్, ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సునీల్ చౌదరిపై 8,193 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2021 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి, మొతాబ్ షేక్ విజయం కొత్త ఊపిరిని పోసింది. న్యాయపోరాటం చేసి మరీ గెలిచిన ఈ 'ఫరక్కా హీరో' కథ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story