Mumbai: ముంబైలో శరద్ పవార్‌తో ఎంపీ బీద మస్తాన్ రావు ఆత్మీయ భేటీ
Mumbai: ముంబైలో కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు జేపీసీ (JPC) సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డా. బీద మస్తాన్ రావు, శరద్ పవార్ ను ఆత్మీయంగా కలుసుకున్నారు.
Mumbai: ముంబైలో శరద్ పవార్‌తో ఎంపీ బీద మస్తాన్ రావు ఆత్మీయ భేటీ
Mumbai: ముంబైలో ఈరోజు (03.07.2026) కార్పొరేట్ లాస్ (సవరణ) బిల్లు–2026పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశాల సందర్భంగా... రాజ్యసభ సభ్యులు, జేపీసీ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్, భారత రాజకీయాల్లో విశిష్ట నాయకుడు, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు శరద్ పవార్ ని ఆయన కుమార్తె, రాజ్య సభ సభ్యురాలు, జేపీసీ సభ్యురాలు సుప్రియా సూలే తో వెళ్ళి , ఆత్మీయంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా డా. బీద మస్తాన్ రావు యాదవ్, శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేశంలో కార్పొరేట్ చట్టాల సంస్కరణలు, పారదర్శకత, పెట్టుబడుల ప్రోత్సాహం, సులభతర వ్యాపార వాతావరణం, పార్లమెంటరీ వ్యవహారాలు తదితర అంశాలపై పరస్పరం స్నేహపూర్వకంగా చర్చించారు.




