Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: టాటా గ్రూప్‌ను కుట్రపూరితంగా నాశనం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ సంచలన పోస్ట్. ప్రధాని మోదీ, అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు.
Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ (Tata Sons) లో ఛైర్మన్ నియామక వివాదం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూప్‌ను కుట్రపూరితంగా నాశనం చేస్తున్నారని, దీనిపై మాట్లాడే ధైర్యం ఏ వ్యాపారవేత్త కూడా చేయలేకపోతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"టాటా గ్రూప్‌ను కుట్ర పూరితంగా నాశనం చేస్తున్నారు. ట్రస్ట్‌ను బలహీనపరిస్తే గ్రూప్ కంపెనీలు, వాటిపై ఆధారపడిన లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ఇంత జరుగుతున్నా ఒక్క వ్యాపారవేత్త కూడా మాట్లాడటానికి సాహసించట్లేదు. వారు మిమ్మల్ని సొంతం చేసుకునేంత వరకు మౌనంగా ఉంటారా?" అని ప్రశ్నించారు.
"భారతదేశంలో వ్యాపార రంగం అనేది ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల ఆటబొమ్మ కాదు. దీనిపై ప్రశ్నించే ధైర్యం మీకు లేకపోవచ్చు.. కానీ మాకు ఉంది. ఈ విషయంలో తగిన న్యాయం జరిగేలా మేము పోరాడతాం" అని రాహుల్ స్పష్టం చేశారు.
ఇటీవల టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఎన్. చంద్రశేఖరన్ ను మరో ఐదేళ్ల కాలానికి ఛైర్మన్‌గా పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, చెల్లుబాటు కాదని టాటా ట్రస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ అంతర్గత వివాదం సాగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా రాజకీయ, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై ప్రభుత్వం గానీ, టాటా గ్రూప్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.




