Karnataka: సరిహద్దులు దాటిన తెలుగు ఆత్మాభిమానం కర్ణాటకలో నారా లోకేశ్ హవా!

Karnataka: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కర్ణాటకలోని సింధనూరులో పర్యటించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించారు.

HARIKISHAN
Published on: 4 April 2026 9:41 AM IST
Karnataka
X

Karnataka: సరిహద్దులు దాటిన తెలుగు ఆత్మాభిమానం కర్ణాటకలో నారా లోకేశ్ హవా!

Karnataka: ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు కర్ణాటక రాష్ట్రంలో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. సింధనూరులో జరగనున్న ఈ పర్యటన రాజకీయంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం సింధనూరుకు చేరుకున్న వెంటనే భారీ బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డువరకు జరిగే ఈ ర్యాలీలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు..

ఈ పర్యటనలో ముఖ్య ఆకర్షణగా నిలిచేది స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ. హోసల్లీ క్యాంప్‌లోని కమ్మవారి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ కూడా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ద్వారా తెలుగు ప్రజల గౌరవాన్ని కర్ణాటకలో మరోసారి ప్రతిష్ఠించే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు..

అనంతరం లోకేశ్ హోసల్లీ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ స్కూల్ విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైనిక శిక్షణకు మార్గం సుగమం చేసే విధంగా ఈ సంస్థ రూపుదిద్దుకుంది.

ఈ సందర్భంగా స్కూల్ హాస్టల్ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించనున్నారు. విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన వసతి కల్పించడం ఈ హాస్టల్ ప్రత్యేకత. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కర్ణాటకలోని తెలుగు ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. మొత్తానికి లోకేశ్ పర్యటన.. రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగాల్లో ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.

HARIKISHAN

HARIKISHAN

Next Story