Sharad Pawar: అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Sharad Pawar: డీహైడ్రేషన్ సమస్యతో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.

Arun Chilukuri
Published on: 26 Nov 2026 3:35 PM IST
Sharad Pawar
X

Sharad Pawar: అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-SP) అధినేత, సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించినట్లు పవార్ కుమార్తె, బారామతీ ఎంపీ సుప్రియా సూలే గురువారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

ప్రస్తుతం శరద్ పవార్‌కు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సుప్రియా సూలే తెలిపారు. ఇటీవలే ఛాతీలో నొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కు ఇదే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన పవార్, నవంబర్ 5న డిశ్చార్జ్ అయ్యారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కొంతకాలం ప్రయాణాలు చేయొద్దని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ.. ఆయన తమ మాట వినకుండా నిరంతరం పనిలో నిమగ్నమవుతున్నారని సుప్రియా సూలే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.