NEET Paper Leak: సీబీఐ చార్జిషీట్‌కు కోర్టు ఆమోదం.. నీట్ పేపర్ లీక్ నిందితులపై ఊచకోత గ్యారెంటీ

NEET Paper Leak: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యుజి పేపర్ లీక్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

CR Reddy
Published on: 14 Aug 2026 7:30 AM IST
NEET Paper Leak
X

NEET Paper Leak

NEET Paper Leak: దేశంలోని లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ యుజి 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌ను న్యాయస్థానం స్వీకరించింది. నిందితులు ప్రణాళికాబద్ధంగా పేపర్ లీక్ సిండికేట్‌ను నడిపారని, 13 మంది నిందితులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా స్పష్టం చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను బయటకు చేరవేయడంలోనూ, వాటిని వ్యాప్తి చేయడంలోనూ ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారని కోర్టు పేర్కొంది.

కేసు వివరాలను లోతుగా పరిశీలిస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నమ్మకాన్ని కొందరు నిపుణులే దారుణంగా వమ్ము చేసినట్లు తేలింది. ప్రశ్నపత్రాలను ఇతర భాషల్లోకి అనువాదం చేసేందుకు ఎన్టీయే నియమించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఈ దారుణానికి ఒడిగట్టారు. రసాయన శాస్త్ర అనువాదకుడిగా ఉన్న ప్రధాన నిందితుడు పి.వి. కులకర్ణి తనకు అప్పగించిన పనిని దుర్వినియోగం చేశాడు. తనిఖీలు సరిగ్గా ఉండవనే విషయాన్ని అనుకూలంగా మార్చుకుని, ప్రశ్నలకు సంబంధించిన వివరాలను రహస్యంగా కాగితపు ముక్కలపై రాసుకుని బయటకు తెచ్చాడు. ఫిజిక్స్ నిపుణురాలు మనీషా సంజయ్ హవల్దార్, బయాలజీ నిపుణురాలు మనీషా గురునాథ్ మంధారే కూడా ఈ అక్రమాల్లో భాగస్వాములయ్యారని విచారణలో వెల్లడైంది.

పరీక్ష రహస్యాలను ఎవరికీ వెల్లడించబోమని ఎన్టీయేకు లిఖితపూర్వక హామీ ఇచ్చిన ఈ ముగ్గురు నిపుణులు తీవ్ర విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధంగా కోట్లాది రూపాయలు సంపాదించాలనే దురాశతో కోచింగ్ ఇచ్చే సాకుతో ఇతర సహ నిందితులకు, పలువురు అభ్యర్థులకు లీకైన ప్రశ్నలను విక్రయించారు. ప్రభుత్వ ఉద్యోగుల హోదాలో ఉంటూ అవినీతి నిరోధక చట్టం కింద తీవ్ర నేరానికి ఒడిగట్టారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాల విధ్వంసం, అవినీతి నిరోధక చట్టం, ప్రజా పరీక్షల నిరోధక చట్టం 2024 లోని పలు కఠిన నిబంధనల కింద కోర్టు కేసు నమోదు చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story