Jitendra Singh: మీకు అనుకూలమైనప్పుడే రండి.. నీట్ వివాదంపై చర్చలకు సిద్ధమన్న కేంద్రం!

Jitendra Singh: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసింది.

Arun Chilukuri
Published on: 23 July 2026 4:57 PM IST
Jitendra Singh
X

Jitendra Singh: మీకు అనుకూలమైనప్పుడే రండి.. నీట్ వివాదంపై చర్చలకు సిద్ధమన్న కేంద్రం!

Jitendra Singh: దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీకేజీ (NEET Paper Leak) వ్యవహారంలో ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక దిద్దుబాటు చర్యలను ముమ్మరం చేసింది. సమస్య పరిష్కారానికి చర్చలకు రావాల్సిందిగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, కాక్రోచ్‌ జనతాపార్టీ (CJP) నేతలను ప్రభుత్వం మరోసారి అధికారికంగా ఆహ్వానించింది.

విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. "మీకు అనుకూలంగా ఉండే సమయంలో ఎప్పుడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆందోళనకారుల తరఫున కొందరు ప్రతినిధులు వచ్చి ప్రభుత్వంతో నేరుగా మాట్లాడవచ్చు" అని ఆయన పిలుపునిచ్చారు.

ఆందోళనకారుల డిమాండ్లను పరిశీలించి కేంద్రం ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలను పంపిందని, వాటిపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలోగానీ లేదా ఆయన కార్యాలయంలోగానీ ఈ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ చర్చల్లో జేపీ నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

తొలుత చర్చలు ప్రారంభిస్తే క్రమంగా సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభిస్తుందని జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును, శ్రేయస్సును కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story