NEET UG 2026 Result Out: నీట్ యూజీ 2026 ఫలితాలు విడుదల.. ఇద్దరు టాపర్లు

నీట్ యూజీ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆర్యన్ గుప్తా, పాన్‌షుల్ బన్సాల్ సంయుక్త టాపర్లుగా నిలిచారు. 11.21 లక్షల మంది అర్హత సాధించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 1:20 AM IST
NEET UG 2026 Result Out
X

NEET UG 2026 Result Out

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ యూజీ 2026 తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించిన రీ-నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఈ ఏడాది ఆర్యన్ గుప్తా (పంజాబ్), పాన్‌షుల్ బన్సాల్ (హర్యానా) సంయుక్త టాపర్లుగా నిలిచారు. ఇద్దరూ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి అగ్రస్థానాన్ని పంచుకున్నారు.

ఎన్‌టీఏ వెల్లడించిన వివరాల ప్రకారం, 690 మార్కులకు పైగా 138 మంది, 700కు పైగా 19 మంది, 650కు పైగా 1,492 మంది, 600కు పైగా 10,160 మంది, 500కు పైగా 90,780 మంది అభ్యర్థులు మార్కులు సాధించారు.

ఈసారి మొత్తం 11.21 లక్షల మంది అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ మరియు ఇతర అనుబంధ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు.

విభాగాల వారీగా అర్హత సాధించిన వారి సంఖ్య ఇలా ఉంది:

జనరల్ – 2.91 లక్షలు

ఓబీసీ-ఎన్‌సీఎల్ – 5.12 లక్షలు

ఎస్సీ – 1.59 లక్షలు

ఎస్టీ – 63,716

ఈడబ్ల్యూఎస్ – 95,026

పీడబ్ల్యూబీడీ – 3,666

మహిళా అభ్యర్థులు ఈసారి విశేష ప్రదర్శన కనబరిచారు. అర్హత సాధించిన వారిలో 58 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. పరీక్ష రాసిన మహిళల్లో 56.8 శాతం, పురుషుల్లో 55.1 శాతం మంది అర్హత సాధించారు.

ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్వహించనుండగా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్నాయి.

విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని, సీట్లు ఇప్పిస్తామంటూ వచ్చే మోసపూరిత కాల్స్, సందేశాలను నమ్మవద్దని ఎన్‌టీఏ హెచ్చరించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story