Neha Bora: పీస్ బాండ్‌పై సంతకం చేసే ప్రసక్తే లేదు.. పోలీసులకు తెగేసిచెప్పిన నేహా బోరా!
Neha Bora: పోలీసుల పీస్ బాండ్‌పై సంతకం చేసే ప్రసక్తే లేదని, శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కని ఐసా (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తేల్చిచెప్పారు.
Neha Bora: పీస్ బాండ్‌పై సంతకం చేసే ప్రసక్తే లేదు.. పోలీసులకు తెగేసిచెప్పిన నేహా బోరా!
Neha Bora: శాంతియుతంగా జీవిస్తానని, శాంతిభద్రతలను కాపాడతానని పూచీకత్తు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట సమర్పించాల్సిన బాండ్‌పైన సంతకం చేసేది లేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను విడుదల చేసే క్రమంలో రూ. 10 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పీస్ బాండ్ సమర్పించాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ పోలీసు నోటీసులను సవాలు చేస్తూ నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
నేను ఎవరి శాంతిని కాపాడాలి? : నేహా
న్యాయస్థానం తీర్పు వెలువడిన నేపథ్యంలో తాను ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, ఆ బాండ్‌పై సంతకం పెట్టే ప్రసక్తే లేదని నేహా బోరా తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా "నేను ఎవరి శాంతిని కాపాడాలి?" అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె.. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసనలు తెలపడం ప్రతి పౌరుడి హక్కని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే చాలు, దానిని శాంతిభద్రతలకు భంగం కలిగించినట్లుగా భావించి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, 'సర్' ప్రక్రియపై స్వయంగా ఎన్నికల కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో నేహా బోరా క్రియాశీలకంగా పాల్గొనడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.




