Nitish Kumar: బిహార్ సీఎం పదవికి నితీశ్‌ కుమార్ రాజీనామా!

Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Arun Chilukuri
Published on: 14 April 2026 3:43 PM IST
Nitish Kumar
X

Nitish Kumar: బిహార్ సీఎం పదవికి నితీశ్‌ కుమార్ రాజీనామా!

Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీశ్‌ కుమార్ మంగళవారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయడంతో పాటు క్యాబినెట్‌ను రద్దు చేశారు. ఇటీవల నితీశ్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముగిసిన 21 ఏళ్ల పాలన:

నితీశ్‌ కుమార్ బిహార్ రాజకీయాల్లో అత్యంత సుదీర్ఘ కాలం (21 ఏళ్లు) ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశమే చివరిది. గత నెల 30న ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

కొత్త సీఎంగా సామ్రాట్‌ చౌదరి?

రేపు (ఏప్రిల్ 15న) బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్‌ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.

కొత్త శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా నియమించింది. జేడీయూ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

నితీశ్‌ మోడల్ కొనసాగుతుంది:

జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, నితీశ్‌ కుమార్ పదవిలో లేకపోయినా ఆయన పాలనా మార్క్, అభివృద్ధి పనులు రాష్ట్రంలో కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన సలహాలు, సహకారం ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

మొత్తానికి నితీశ్‌ కుమార్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుండగా, బిహార్‌లో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story