Odisha: శోభాయాత్రలో గన్‌తో హల్‌చల్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!

Odisha: శ్రీరామనవమి శోభాయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే నవీన్ కుమార్ జైన్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 March 2026 7:26 AM IST
Odisha
X

Odisha: శోభాయాత్రలో గన్‌తో హల్‌చల్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!

Odisha: శోభాయాత్ర సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. (Odisha MLA Fires Gun Shots In Air) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారిపై కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా బలంగీర్‌ జిల్లాలో శోభాయాత్ర నిర్వహించారు.

కాగా, టిట్లాగఢ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నవీన్ కుమార్‌ జైన్‌ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ప్యాంటు జేబు నుంచి గన్‌ తీసి గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో శోభాయాత్రలో పాల్గొన్న వందలాది భక్తులు, స్థానికులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే నవీన్ కుమార్‌ జైన్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌వో) ప్రేమ్‌చంద్ నాగ్‌పై కేసు నమోదు చేశారు. ఆ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పీఎస్‌వోపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, సస్పెండ్‌ చేశామని బలంగీర్ ఎస్పీ అభిలాష్ తెలిపారు. ఎమ్మెల్యే భద్రతా విధుల నుంచి ఆ పీఎస్‌వోను తొలగించినట్లు వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story