Parlakhemundi: జాతీయ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గజపతి బాలిక ప్రతిభ!

Parlakhemundi: జాతీయ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గజపతి జిల్లాకు చెందిన శాంభవి సాహు రెండు కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటింది. మోహన్ బెహరా అభినందనలు.

S.Anil, Gajapati Dst
Published on: 14 Sept 2026 8:31 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: జాతీయ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గజపతి బాలిక ప్రతిభ!

Parlakhemundi: పుదుచ్చేరి లోని ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు జరిగిన 55వ కేవీఎస్ జాతీయ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ లో గజపతి క్రీడాకారిణి ప్రతిభ చాటారు.పట్టణంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 9 వ తరగతి చదువుకుంటున్న శాంభవి సాహు 1000 నుంచి 3000మీటర్ల రోలర్ స్కేటింగ్ (అండర్-17 బాలికల విభాగం) పోటిలో తలపడి రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది.

శాంభవి రెండుసార్లు పతకాలు సాధించడం ఆమె నిరంతర కృషి , అంకితభావంతో కూడిన శిక్షణ ఫలితమేనని శిక్షకుడు సుకాంత్ దోల బెహరా అన్నారు. సాహు కు గజపతి జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ బెహరా తో పలువురు అభినందనలు తెలియజేశారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst