CEC Gyanesh Kumar: సీఈసీ టార్గెట్‌గా విపక్షాలు.. ఓట్ల తొలగింపుపై ఆగ్రహం, పదవి నుండి తప్పించేందుకు నోటీసు!
CEC Gyanesh Kumar: ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష ఎంపీలు.. ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించేందుకు నోటీసులు సిద్ధం చేశారు.
CEC Gyanesh Kumar: సీఈసీ టార్గెట్‌గా విపక్షాలు.. ఓట్ల తొలగింపుపై ఆగ్రహం, పదవి నుండి తప్పించేందుకు నోటీసు!
CEC Gyanesh Kumar: ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష ఎంపీలు.. ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించేందుకు నోటీసులు సిద్ధం చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో ఏదో ఒక సభలో నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అధికార పక్షానికి అనుకూలంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ పనిచేస్తున్నారంటూ పదే పదే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో ఓట్ల తొలగింపుపై విచారణను ఆయన అడ్డుకుంటున్నారని మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేందుకు నోటీసులు సిద్ధం చేశాయి విపక్షాలు. లోక్‌సభలో నోటీసులు ఇవ్వాలంటే వందమంది ఎంపీల సంతకాలు అవసరం ఉండగా.. 193 మంది లోక్‌సభ ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభలో 50 మంది సంతకాలు చేయాల్సి ఉండగా.. 63 మంది చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో నోటీసులు ఇస్తే.. సీఈసీ తొలగింపు కోసం పార్లమెంట్‌లో నోటీసులు ఇవ్వడం చరిత్రలో తొలిసారి కానుంది.




