Pahalgam Attack: పహల్గాం బాధితులకు ప్రధాని మోదీ నివాళులు.. ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు!

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది.. బాధితులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ. ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేసిన ప్రధాని. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంపై కథనం.

Arun Chilukuri
Published on: 22 April 2026 2:34 PM IST
PM Modi
X

Pahalgam Attack: పహల్గాం బాధితులకు ప్రధాని మోదీ నివాళులు.. ఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు! 

Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బాధితులకు ఘన నివాళులర్పించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను దేశం ఎప్పటికీ మరువదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రధాని భావోద్వేగపూరిత పోస్ట్‌ను పంచుకున్నారు.

"పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసింది. ఈ విషాదంలో మరణించిన వారిని స్మరించుకుంటున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు. దుఃఖంలోనూ, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే సంకల్పంలోనూ దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలొగ్గబోదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముష్కరుల కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాంతిని దెబ్బతీసే శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని ప్రధాని వ్యాఖ్యలు ప్రతిబింబించాయి.

గతేడాది ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హిందువులే లక్ష్యంగా సాగిన ఈ మారణహోమంలో 26 మంది అమాయకులు బలియ్యారు. ఈ ఘటనకు ప్రతికారంగా భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి, సరిహద్దుల అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలను తుత్తునియలు చేసిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story