Paralakhemundi: గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యే ఆదర్శ విద్యాలయ లక్ష్యం!

Paralakhemundi: గ్రామీణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే ఆదర్శ విద్యాలయాల లక్ష్యం: కాశీనగర్ ఆదర్శ విద్యాలయ కార్యక్రమంలో ఎమ్మెల్యే రూపేష్ కుమార్.

S.Anil, Gajapati Dst
Published on: 11 Sept 2026 12:58 PM IST
Paralakhemundi
X

Paralakhemundi: గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యే ఆదర్శ విద్యాలయ లక్ష్యం!

Paralakhemundi: కాశీనగర్ సమితిలోని వల్లాడ పంచాయతీలో గల ఆదర్శ విద్యాలయంలో గురువారం జరిగిన ప్రతిష్టా దివస్ కార్యక్రమంలో శాసనసభ్యుడు రూపేష్ కుమార్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఆధునిక, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను కల్పించడమే ఒడిశా ఆదర్శ విద్యాలయ ప్రధాన లక్ష్యమని అన్నారు.

విద్యా రంగంలో నూతన కార్యక్రమాలు, జాతీయ విద్యా విధానం, ఆధునిక విద్యా పద్ధతులు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి వంటి అంశాలపై కూడా చర్చించారు.

వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు బల్ల సాయమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst