Paralakhemundi: పర్లాఖెముండిలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం!
Paralakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండిలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ఎంపీ ప్రదీప్ ఎమ్మెల్యే రూపేష్, కలెక్టర్ అక్షయ్ పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
Paralakhemundi: పర్లాఖెముండిలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం!
Paralakhemundi: స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా గజపతి జిల్లా అంతటా శుక్రవారం స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించారు.పర్లాఖెముండి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రహ్మపుర లోకసభ సభ్యుడు ప్రదీప్ కుమార్ పాణిగ్రహి,
అతిథి లుగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్, పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి తదితరులు పాల్గొన్నారు.ముందుగా గాంధీ కూడలి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రాజుగారి కోట వద్ద స్వచ్చ భారత్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. రాజుగారి కోట ప్రాంతంలో అతిథిలు రోడ్లను ఊడ్చుతూ ప్రజల అందరికీ పరిసరాల పరిశుభ్రతపై వారు అవగాహన కల్పించారు.
ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ప్రదీప్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తేదీ నుంచి నాటి వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యాలు దరిచేరవని, అందుకోసమే ప్రతి ఒక్కరు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకారం అందజేయాలని సూచించారు .




