Parlakhemundi: ఆర్టీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం

Parlakhemundi: పర్లాఖెముండి ఆర్టీవో కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. కంప్యూటర్లు, పత్రాలు దగ్ధమైనట్లు ఆర్టీవో తపన్ కుమార్ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Aug 2026 11:16 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: ఆర్టీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం

పర్లాఖెముండి: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయంలో శనివారం మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆర్టీవో తపన్ కుమార్ మాట్లాడుతూ భవనంలో ఉన్నటువంటి కంప్యూటర్ గది, బయోమెట్రిక్ గదుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని, సుమారు రూ లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు.

భవనంలో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఉన్న గదిలో కంప్యూటర్లు కాగితాలు అగ్నికి ఆహుతి అయ్యాయని , మంటలు చెలరేగుతున్న సమయంలో సిబ్బంది చేరుకొని అదుపు చేసినట్లు అగ్నిమాపక అసిస్టెంట్ అధికారి సుఖంత్ కుమార్ మహంత్ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story