Parlakhemundi: మహేంద్రగిరిపై 23వ జాతీయ మౌంటెన్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్

Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లా మహేంద్రగిరి పర్వతంపై 23వ జాతీయ మౌంటెన్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్. అక్టోబర్ 1 నుండి 4 వరకు పోటీలు కలెక్టర్ అక్షయ్ సునీల్.

S.Anil, Gajapati Dst
Published on: 29 Sept 2026 7:19 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: మహేంద్రగిరిపై 23వ జాతీయ మౌంటెన్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్

పర్లాఖెముండి: గజపతి జిల్లాలో పుణ్య ప్రసిద్ధిగాంచిన మహేంద్రగిరి పర్వతంపై ఒడిశా సైక్లింగ్ అసోసియేషన్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా 23వ జాతీయ మౌంటెన్ సైక్లింగ్ ఛాంపియన్‌ షిప్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ అన్నారు.

ఈ విషయమై సోమవారం సాయంత్రం పర్లాఖెముండి లో గల కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ భవనంలో విలేకరుల సమావేశంలో వివరాలు ఇలా వెల్లడించారు.. అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఒడిశాలో ఇంతటి పెద్ద జాతీయ స్థాయి మౌంటెన్ బైక్ పోటీని నిర్వహించడం మాకు గర్వకారణమని, ఈ నిర్వహణ ద్వారా గజపతి జిల్లా మహేంద్రగిరి యొక్క సహజ సౌందర్యం, పర్యాటక సామర్థ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయని తెలిపారు.

దేశంలోని సుమారు 30 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని ప్రస్తుతానికి 600 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు వివరించారు. పోటీలో చక్కగా రాణించి మొదటి, రెండవ, మూడవ స్థానాలు సాధించిన అర్హతగల క్రీడాకారులు భారత జట్టులో స్థానం సంపాదించి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారని అన్నారు.

క్రీడాకారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఒడిశా సైక్లింగ్ అసోసియేషన్ సాధారణ కార్యదర్శి ప్రసన్నకుమార్ రౌత్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శైలేంద్ర పతక్ తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst