Parlakhemundi: పోలీస్-న్యాయవాదుల సమన్వయ సదస్సు.. ఎస్పీ ఆదేశాలు!

Parlakhemundi: గజపతి జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాని అధ్యక్షతన పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదుల సమన్వయ సమావేశం. కేసుల విచారణ, వేగవంతమైన న్యాయంపై చర్చ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Sept 2026 12:49 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: పోలీస్-న్యాయవాదుల సమన్వయ సదస్సు.. ఎస్పీ ఆదేశాలు!

Parlakhemundi: గజపతి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న నేరాలను తగ్గించి, సమాజంలో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఎస్పీ ప్రహ్లాద్ సహాని అధ్యక్షతన బుధవారం ఎస్పీ కార్యాలయంలో ప్రభుత్వ న్యాయవాదులు, పోలీసుల మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశం ఎస్పీ ప్రహ్లాద్ మాట్లాడుతూ కేసు ఫైల్‌ ను ఎలా తయారు చేయాలి , దర్యాప్తు ప్రక్రియలోని లోపాలను ఎలా సరిదిద్దాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. దీనికి అదనంగా, పోలీసులు ప్రజలకు ,చేరువగా ఉంటూ, న్యాయాన్ని వేగంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పలు కేసుల్లో పోలీసులు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు.

అనంతరం ప్రభుత్వ న్యాయవాదులు, పోలీసు అధికారులకు ఎస్పీ ప్రహ్లాద్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ బిరంచి బాగ్, జిల్లా అబ్కారీ ఎస్పీ ప్రదీప్ కుమార్ సాహు, ఆర్ ఉదయగిరి ఎస్డీపీవో రాకేష్ కుమార్ తో పాటు ఠాణా‌ అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story